టిడిపి మహానాడు సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతీ పండుగకు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు నిరీక్షిస్తున్నారు.
మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు
మంత్రులు కూడా రకరకాల తేదీలను అనేక మార్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్య పడలేదు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా చంద్రబాబునే వచ్చే ఆగస్ట్ 15 అని తేదీ చెప్పటంతో ఈసారి పక్కా అని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు…
మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం: చంద్రబాబు
ఏడాది క్రితం రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని ప్రస్తుతం ప్రజలలో అశాంతి తగ్గిందని, కూటమి పాలనతో చీకటి తొలగి పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు వేదికపైనే మాట్లాడిన చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం బిడ్డల ఉన్నతికి దోహదం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు..