అమెరికా (USA)లో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త…ప్రతి హెచ్‌-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం…!

ప్రతి హెచ్‌-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం..

అమెరికా (USA)లో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్‌-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు..హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్‌1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ప్రతి హెచ్‌-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ”మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్‌ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి” అని లుట్నిక్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారు..

ఇండియన్స్ కే తిప్పలా?
…
ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరుతో ట్రంప్ సంచలన నిర్ణయం
తాత్కాలిక ఉద్యోగ వీసాలపై భారీగా ఫీజుల పెంపు
హెచ్1బీ వీసాల కోసం కంపెనీలపై ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు
లక్ష డాలర్లు అంటే ఏడాదికి 88 లక్షల రూపాయలు
ఉద్యోగాల్లో అమెరికన్లకు ప్రాధాన్యమే లక్ష్యంటున్న ట్రంప్
హెచ్1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయంటున్న ట్రంప్
విదేశీయుల కంటే అమెరికన్ నిపుణులకే చాన్స్ ఇవ్వాలంటున్న ట్రంప్
ట్రంప్ కొత్త నిర్ణయంతో ఇండియన్స్ మీదే భారీగా ఎఫెక్ట్
హెచ్1బీ వీసాదారుల్లో 71 శాతం మంది భారతీయులే
కంపెనీలు ఏటా 88 లక్షలు చెల్లించాలనుకుంటేనే ఇంక హెచ్1బీ వీసాలు
దీంతో చాలామంది తిరిగి రావాల్సిన ముప్పు?
కొత్తగా అమెరికాలో జాబ్స్ అవకాశాలు తగ్గిపోయే అవకాశం
అమెరికన్ల జాబ్స్ విదేశీయులకు ఇస్తున్నారంటున్న ట్రంప్
అమెరికన్లకు జాబ్స్ వచ్చేలా చూడడానికే భారీ ఫీజులన్న వాదన
ఎక్కువ స్కిల్స్ ఉన్నవాళ్లే ఉండాలంటున్న ట్రంప్ సర్కార్
…

అమెరికాలో H1B వీసాదారుల్లో..
ఇండియన్స్ 71%
చైనావాళ్లు 11.7%
ఇతరదేశాలు 17.3%.