కొత్త పార్టీ” ప్రచారంపై బండి సంజయ్ ఘాటు స్పందన
“నేను కొత్త పార్టీ పెడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ ప్రొపగాండా. మాకు చివరి కోరిక ఏమిటని అడిగితే… మా పార్థివ దేహంపై BJP జెండా కప్పాలని కోరుకునేంత నిబద్ధత ఉన్న కార్యకర్తలం” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar అన్నారు.
“సొంత కొడుకుపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా… విచారణకు సహకరించేందుకు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయిన నాయకుడిని నేను. అలాంటి నిబద్ధతతో పని చేస్తున్న మాకు… KCR కొడుకు నడిపిస్తున్న ఫేక్ మీడియా ఫ్యాక్టరీ సృష్టించే అబద్ధపు ప్రచారాలకు భయపడే పరిస్థితి లేదు” అంటూ మండిపడ్డారు.
అంతేకాదు…
“తెలంగాణలో మీ కుటుంబ పాలనకు శవపేటికలో మేకులు కొట్టింది మేమే…
మీ అవినీతి సామ్రాజ్యాన్ని చిటికెన వేలితో కూల్చింది మేమే…
మీ కుటుంబ పాలనపై నిరంతరం పోరాడింది కూడా మేమే…” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మీ ఫేక్ ప్రచారం మా సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేం” అని స్పష్టం చేశారు.