అక్రమంగా భారీ ఎత్తున నివసిస్తున్న బంగ్లాదేశీయులు..అక్రమంగా ఇండ్లు, ప్రార్థన మందిరాల ఏర్పాటు..!

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ అలర్ట్ జారీ చేసింది.అలాగే రాష్ట్రాలు తమ ప్రాంతంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి.. వెంటనే పంపించాలని ఆదేశించింది. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్‌లో ఎవరూ ఉహించని విధంగా అహ్మదాబాద్‌లోని (Ahmedabad) చండోలా ప్రాంతంలో 1,000 కంటే ఎక్కువ మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు (Illegal Bangladeshi immigrants) పట్టుబడ్డారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై.. ఈ తనిఖీలను ముమ్మరం చేయగా మరో 200 మంది వరకు బయటపడ్డారు.

వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలో చొరబడటమే కాకుండా.. చండోలా (Chandola) ప్రాంతంలో 2.5 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అక్రమంగా ఇండ్లు, ప్రార్థన మందిరాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఈ రోజు ఉదయం రెండవ దశ కూల్చివేత చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 3,000 మందికి పైగా పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) అధికారులు పాల్గొన్నారు. 50 కి పైగా బుల్డోజర్‌లను ఉపయోగించారు. ఈ కార్యక్రమం “ఆపరేషన్ సిందూర్”గా పిలవబడుతుంది మరియు భద్రతా ఏర్పాట్ల మధ్య నగర పునరాభివృద్ధిలో భాగంగా ఈ చర్యలు చేపట్టబడ్డాయి.