బంజారా అర్చక సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా..నేనావత్ కిషన్ బావోజీ ..

దేవరకొండ………..
ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు స్థపతి యన్ వల్లి నాయగమ్
మరియు బంజారా అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయరాం గురు స్వామి చేతుల మీదుగా బంజారా అర్చక సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందుకున్న నేనావత్ కిషన్ బావోజీ
ఉమ్మడి నల్గొండ జిల్లా బంజారా అర్చక సంఘం అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందుకొని ప్రమాణ స్వీకారం చేసిన. నేనావత్ కిషన్ బావోజీ
ఉమ్మడి నల్గొండ జిల్లా (భువనగిరి, యాదాద్రి,సూర్యపేట, నల్లగొండ బంజారా అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు గా నియామక పత్రాన్ని అందుకొని రాష్ట్ర కార్యాలయం నందు ప్రమాణస్వీకారం చేశారు ..అనంతరం జిల్లా అధ్యక్షులునేనావత్ కిషన్ బావోజీ గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా బాధ్యతను, సమాఖ్య ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లి బంజారా అర్చక సంఘం తెలంగాణ బాధ్యులుగా క్రమశిక్షణ కట్టుబడి బంజర అర్చక సంఘం తెలంగాణ సంస్థకు గౌరవంగా పనిచేస్తానని బంజారా బావజీలు సాదు సంతులు మహారాజులు అందర్నీ కలుపుకొని సహకరిస్తానని వారు చెప్పడం జరిగింది.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు జయరాం గురు స్వామి మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా డిడిఎన్ఎస్ బంజారా బావజీలు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు..