బన్నీ అరెస్టు కేసులో బిగ్ ట్విస్ట్‌ ..అవసరమైతే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడను….రేవతి భర్త భాస్కర్..

తోకీసులాటలో మరణించిన రేవతి భర్త.. పుష్ప 2 ప్రీమియర్ షో కు బన్నీ రావడంతో క్రౌడ్ ఎక్కువై ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్య థియేటర్లో రేవతి 39 ఏళ్ల తన భార్య మరణించిందని.. కేసులో బిగ్ ట్విస్ట్‌ నెలకొంది. కొద్ది సేపటి క్రితం రేవతి భర్త భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. అవసరమైతే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడనని వెల్లడించిడు.

ఈ ప్రమాదానికి హీరో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని.. బన్నీని రిలీజ్ చేయాలంటూ పోలీసులను కోరాడు. అల్లు అర్జున్ తో పాటు.. ఆరోజు చాలామంది థియేటర్ కు వచ్చారంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం రేవతి భర్త చేసిన కామెంట్స్ కేసులో బిగ్ ట్విస్ట్‌గా నిలిచాయి. అసలు ఏం జరిగింది.. కేసు పెట్టిన ఆయనే అల్లు అర్జున్ కు సంబంధం లేదని మీడియా ముందు చెప్పడానికి కారణం ఏంటని సందేహాలు జనంలో మొదలయ్యాయి. అయితే ఈ కేసు ముందు ముందు మరిన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.