నడి రోడ్డుపై భర్తను తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసి చంపిన భార్య..

బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది… 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. అక్కడికక్కడే అమరేంద్ర మృతి చెందాడు.గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరేంద్ర భార్యను తరచూ వేధించేవాడని.. ఆ వేధింపులు తాళలేక భార్య ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
https://x.com/ChotaNewsApp/status/1874685684897989042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1874685684897989042%7Ctwgr%5E48a1b8026b2fa7d89b4e41174bc9058d60d4a41a%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F