అమ్మవారి దర్శనానికి వచ్చి అనంతలోకాలకు ఐదుగురు..!

నిర్మల్(Nirmal) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాసర(Basara) సమీపంలోని గోదావరి నది(Godavari River)లో స్నానానికి వెళ్లి నలుగురు మృతిచెందారు..గల్లంతు అవడం కళ్లారా చూసిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన స్పాట్‌కు వచ్చిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ వాసులుగా గుర్తించారు.

అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగానూ నిర్ధారించారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి.. తిరుగు ప్రయాణంలో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు రాకేష్ (17), వినోద్ (18), రుతిక్ , మదన్ (18) గుర్తించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.. అతని కోసం గాలిస్తున్నారు. గోదావరిలో తేలిన ఇసుక మెటల వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా.. లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. నాలుగు మృతదేహాలను వెలికితీశారు.. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతులను బయటకు వెలికి తీశారు. గోదావరి మొదటి ఘాట్‌ నుంచి అంబులెన్స్‌లో మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా నాలుగు మృతదేహాలను వెలికితీశారని.. ఇంకొకరు నీటిలోనే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తం 18 మంది విహార యాత్రగా అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చారని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని పేర్కొంటున్నారు..