ప్రధానమంత్రి మోదీ, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపుమంట ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పోరుబాట పేరుతో నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లపై గల్లీలో ఉండలేక దిల్లీలోనే తేల్చుకుందామని చలో దిల్లీ కార్యక్రమం చేపట్టామన్న రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామని చెప్పారు. దిల్లీలో ధర్నాకు వంద మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. 2018లో మాజీ సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను 50 శాతం మించకుండా చట్టం చేశారని, కొత్త చట్టం చేయాలంటే గత చట్టం గుదిబండగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ ఆర్డినెన్స్ను గవర్నర్కు, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపినట్లు ఆయన తెలిపారు…
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959