బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచే అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి..!?.

బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో మంత్రి ఉత్తమ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రహం

బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో సాగర్ వెళ్లాల్సిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్

షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల వరకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్

10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్

తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి ఆగ్రహం

ఉత్తమ్ ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అలక

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచే అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్..