బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు
వేగంగా సాగుతున్న సెలబ్రిటీల విచారణ
మరికాసేపట్లో సీఐడీ ముందు హాజరుకానున్న సెలబ్రిటీలు మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి..
గతంలో బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నీ సీఐడీ విచారించనుంది.బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరు సినీనటులను పిలిచి విచారించారు.. ప్రస్తుతం సీఐడీ ముందు హాజరుకానున్న సెలబ్రిటీలు మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి.. విచారణ పిలిచినట్లుగా సమాచారం.