మనదేశంలోని దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు విభాగాల మధ్య సమన్వయానికి కీలకంగా దోహదపడే ‘భారత్ పోల్’ పోర్టల్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు..కేసుల విషయంలో అంతర్జాతీయంగా పనిచేస్తున్న మన దర్యాప్తు సంస్థల పనిని ఈ పోర్టల్ సులభతరం చేస్తుందని, ఇంటర్పోల్ సహకారం వేగంగా అందుకోగలుగుతామని ఆయన అన్నారు. ‘భారత్ పోల్’ను సీబీఐ రూపొందించింది. ”అంతర్జాతీయ పోలీసుల సహకారం ఇప్పటిదాకా సీబీఐ మాత్రమే తీసుకుంటోంది. ‘భారత్ పోల్’ రాకతో మన దేశానికి చెందిన అన్నీ దర్యాప్తు సంస్థలూ, చివరకు రాష్ట్ర పోలీసు విభాగాలు సైతం ఇంటర్పోల్ సాయం తీసుకొనగలుగుతాయి. అంతర్జాతీయంగా మనదేశం చేపట్టే విచారణ ప్రక్రియను కొత్త శకంలోకి ఇది నడిపిస్తుంది. వేర్వేరు సంస్థల మధ్య సమన్వయం, సంబంధాల్లో తలెత్తుతున్న సమస్యలు తొలగించి..నేరగాళ్ల కట్టడికి బాగా పనిచేస్తుంది” అని అమిత్షా అన్నారు..
100 మంది స్వదేశానికి.
ఇకపోతే, సాంకేతిక సంస్థలను వాడుకుని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ఈ పోర్టర్ సహకరించనుంది. భారత ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సహకారంతో కేంద్రం దీనిని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, 2021 నుండి 2024 వరకు వందమంది వాంటెడ్ క్రిమినల్స్ ను ఇంటర్ పోల్ ఛానెల్స్ ద్వారా భారత్ కు తిరిగి తీసుకువచ్చారు..