బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…!
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..
బీజేపీకి బిహార్లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, *జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.*
విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. *ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు.* అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి నెలకొంది.
ఆస్తుల వివరాలు..
సమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు. దీని ప్రకారం *తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది.* అఫిడవిట్లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.