భారీ జనసమీకరణకు బీజేపీ కసరత్తు.
రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ..
కార్యకర్తలతోపాటు ప్రజలను..
లక్ష్యం.. 2 లక్షలు…
ప్రధాని మోదీ సభకు రప్పించేందుకు ఏర్పాట్లు…
ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జ్ బాధ్యతలు.
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, డీకే అరుణల నిత్య పర్యవేక్షణ…
ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు శుక్రవారం పర్యవేక్షించారు…
ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించున్నారు..సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ఆయన హాజరవుతారు..అనంతరం సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తిరిగి వెళ్లనున్నారు..అనంతరం మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి బయలుదేరి 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు..అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్8/10
అనంతరం 3.45 నుంచి 4.15 గంటల వరకు మాదాపూర్ హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించి
ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు..