రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం..!

పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎంపీలను నెట్టివేయడం తో బీజేపీ ఎంపీ(BJP MP) ప్రతాప్ సింగ్ సారంగి(Pratap Singh Sarangi) తలకి గాయం అయింది…దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan).. గాయపడిన ఎంపీని ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్లమెంటరీ చరిత్రలో ఇదో బ్లాక్ డే(Black day).. డెకోరమ్ ఛిన్నాభిన్నమైంది(The decorum was shattered). ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ పార్టీల గూండాయిజానికి(hooliganism) ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు.. ఇటువంటి ప్రవర్తన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. హర్యానా, మహారాష్ట్రలను కోల్పోతే వారు తమ నిరాశను పార్లమెంట్‌లో ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వాళ్లు ప్రజాస్వామ్యంలో నడవడికను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ” అంబేద్కర్ ” వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి.దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.

గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలైన ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టడంతో వారు గాయపడ్డారు. సారంగికి తలకు గాయమైంది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారమైన మకర్ దావర్ వద్ద ఈ ఘటన జరిగింది. సారంగిపైకి రాహుల్ గాంధీ ఒక వ్యక్తి నెట్టడంతో ఆయన మెట్లపై పడిపోయారు. ఈ వ్యవహారం మొత్తం పెద్ద వివాదంగా మారింది..