బ్రెజిల్ దేశంలో ఊహించని పరిణామం. బ్యాక్ ప్యాకెట్లో పేలిన మొబైల్..

బ్రెజిల్ దేశంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్కు వెళ్లింది…వస్తువులు కొనుగోలు చేస్తుండగా.. ఆమె బ్యాక్ ప్యాకెట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ పేలుడులో మహిళ వెనుక భాగంతో పాటు, చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే, మొబైల్ ఫోన్ పేలిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.