సాధారణంగా 23 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళకు ఓసారి పెళ్లి జరుగుతుంటుంది. ఆమె అదృష్టం బాగాలేక కట్టుకున్న వాడికి ఏమైనా అయినా, అతడితో ఇబ్బందులు వచ్చినా రెండోసారి, అందులోనూ సమస్యలు వస్తే మూడోసారి పెళ్లి జరగడం మనం సాధారణంగానే చూస్తుంటాం. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ మహిళ మాత్రం మొత్తంగా 25 మంది అబ్బాయిలను వివాహం చేసుకుంది. కేవలం 7 నెలల వ్యవధిలోనే పాతిక పెళ్లిళ్లు చేసుకున్న ఈమె.. ప్రతీ ఒక్కరి దగ్గర నుంచి డబ్బు, నగలు సహా విలువైన వస్తువులు దోచేసి పారిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నిత్య పెళ్లి కూతురును ఎట్టకేలకు పోలీసులు చిక్కింది? మరి వారు ఈమెను ఎలా పట్టుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉత్తర ప్రదేశ్ మహారాజ్‌గంజ్‌కు చెందిన 23 ఏళ్ల అనురాధ పాశ్వాన్‌కు కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త వద్ద ఉన్న ఈమె స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేసేది. కానీ ఇంట్లో గొడవ జరగ్గా.. భర్తను వదిలేసి భోపాల్‌కు వెళ్లిపోయింది. అక్కడే స్థానిక ఏజెంట్ల ద్వారా పని చేసే వివాహ మోసగాళ్ల ముఠాకు చిక్కింది. అంటే ఓ నలుగురైదుగురు అమ్మాయిలను గ్రూపుగా ఏర్పాటు చేసి.. స్థానిక వివాహ ఏజెంట్లతో సంబంధాలు చూపిస్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలుగా వీరిని పరిచయం చేస్తూ.. పెళ్లిళ్లు ఆలస్యంగా అయ్యే యువకులే లక్ష్యంగా వీరితో వివాహాలు నిశ్చయిస్తారు. ఇలా పెళ్లిళ్లు ఫిక్స్ చేసి.. వివాహాలు కూడా జరిపిస్తారు. ఇందుకోసం 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా తీసుకుంటారు.అయితే ఇలా యువకులను పెళ్లిళ్లు చేసుకున్న మహిళలు.. వివాహం జరిగిన వారం వరకు అక్కడే ఉంటారు. ఆపై డబ్బు, నగలు సహా విలువైన ఇతర వస్తువులను తీసుకుని అర్ధరాత్రి ఇంటి నుంచి పరార్ అవుతుంటారు. ఇందుకు ముఠా సభ్యులు కూడా సాయం చేస్తుంటారు. ఇలా తప్పించుకున్న తర్వాత వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ మరో వ్యక్తిని పెళ్లి చుసుకుని.. ఇదే తంతు కొనసాగిస్తుంటారు. ఇలా అందినకాడికి దోచుకుంటూ వెళ్లిపోతుంటారు. అయితే మే 3వ తేదీన గుజరాత్‌లోని సవాయి నివాసి విష్ణు శర్మ తన భార్య ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డబ్బు, నగలు సహా విలువైన ఇతర వస్తువులు కూడా దోచుకెళ్లినట్లు చెప్పారు..