అప్పట్లో ఎన్టీఆర్.ఇప్పట్లో కేసీఆరే…!.బీఆర్ కే భవన్ లో విచారణకు హాజరుకానున్న రెండో మాజీ సీఎంగా కేసీఆర్..

ఫాంహౌస్‌ నుంచి బీఆర్‌కే భవన్‌ బయల్దేరిన కేసీఆర్‌…

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరుకానున్న కేసీఆర్‌

ఉ.11:30కి బీఆర్‌కే భవన్‌ చేరుకోనున్న కేసీఆర్‌.

కేసీఆర్‌ వెంట హరీష్‌రావు, కవిత, ప్రశాంత్‌రెడ్డి.

బీఆర్‌కే భవన్‌లోకి కేసీఆర్‌ వెంట 9 మందికి అనుమతి

బీఆర్‌కే భవన్‌ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు.

కేసీఆర్‌ రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు.

బందోబస్తులో వందలాది మంది పోలీసులు
బీఆర్‌కే భవన్‌ రోడ్డును మూసివేసిన పోలీసులు..

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకావడానికి మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. కేసీఆర్‌కు ఆమె లేఖ రాసిన తర్వాత మొదటిసారి ఆమె ఫాంహౌస్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో ఆమె వ్యక్తిగతంగా భేటీ అయ్యారు..

అప్పట్లో *ఎన్టీఆర్.ఇప్పట్లో *కేసీఆరే..

*• హైదరాబాద్:- బీఆర్ కే భవన్ లో విచారణకు హాజరుకానున్న రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు.*

_• గతంలో ఓ హత్యాయత్నం కేసులో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి మాజీ సీఎం ఎన్టీఆర్ ఇదే భవనంలో విచారణ ఎదుర్కొన్నారు._

_• కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో కాసేపట్లో కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు..