కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో దాడి…।

Jaipur, Rajasthan, Cockroach Janta Party (CJP).. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు పెరుగుతున్నాయి. ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త పర్యటన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ Jaipur, Rajasthan, Cockroach Janta Party (CJP) వ్యవస్థాపకుడు Abhijeet Dipke అభిజీత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అమరవీరుల స్మారకం షహీద్ స్మార వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు, నిరసనకారులు ఆయనపై భౌతిక దాడికి దిగారు అంటూ ఆరోపణలు వెలువేతున్నాయి . ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నీట్ ఎగ్జామ్ అక్రమాలు, నిరుద్యోగం, దేశ విద్యావ్యవస్థలో లోపాలపై విద్యార్థులు, యువత తరఫున పోరాడేందుకు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త పర్యటన చేపట్టారు. పుణేలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం లక్నో, అమృత్‌సర్, బెంగళూరు మీదుగా జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగియాల్సి ఉంది. ఈ క్రమంలోనే జూన్ 15 సోమవారం నాడు జైపూర్‌లో ఒక రోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ధర్నా ప్రారంభానికి ముందు ఉదయం స్థానిక మీడియాతో మాట్లాడిన అభిజీత్.. దేశంలోని బాధ్యత లేని వ్యవస్థపై యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నట్లు ప్రకటించారు. ధర్నా ప్రాంగణంలో అభిజీత్ దీప్కే నిరసనలో ఉండగదా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కనే నినాదాలు చేస్తూేన దాడికి దిగారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేస్తున్న తరుణంలోనే, గుంపులో నుంచి కొందరు ఆయనపై భౌతిక దాడికి దిగారు. అక్కడ ఉన్న అనుచరులు, భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడికి రెండు రోజుల ముందే Abhijeet Dipke అభిజీత్‌కు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆయన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో.. మహారాష్ట్రలోని హింగోలి పోలీసులు వారి నివాసానికి తక్షణ రక్షణ ఏర్పాటు చేశారు.