రాజకీయ కక్షతో కాళేశ్వరంను పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి CWPRS ఇచ్చిన రిపోర్టు చెంపపెట్టులాంటిది… జీవన్ రెడ్డి..
కాళేశ్వరంపై CWPRS నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: జీవన్‌రెడ్డి.
రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పాడావు పెట్టిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ (CWPRS) ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.
నివేదిక వచ్చి ఐదు రోజులు గడిచినా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను వినియోగించుకోవాలని, పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.