బిఆర్ఎస్ నేతల అరెస్టు..

ఖాళీ యూరియా బ్యాగులతో బీఆర్​ఎన్​ నేతల ఆందోళన – పోలీసులు అదుపులో కేటీఆర్​, హరీశ్​ రావు, జగదీశ్​రెడ్డి – యూరియా అడిగితే రైతులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నలు..
రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై వ్యవసాయశాఖ కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం ముందు కూర్చోని ఆందోళనకు దిగారు. ‘గణపతి బప్ప మోరియా రావాలయ్యా యూరియా’ అంటూ నినాదాలు చేశారు. రైతులకు ఖాళీ సంచులు దిల్లీకి డబ్బులు సంచులు’ అంటూ ఆందోళన చేపట్టారు. యూరియా అడిగితే రైతులపై దాడి చేస్తారా, కొడతారా అంటూ ప్రశ్నించారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని బైఠాయించారు. దీంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు..

ప్రజల ఆందోళనలు చూసైనా ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ఉండాల్సింది: నిరంజన్‌రెడ్డి.

కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

వ్యవసాయశాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్‌
ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కార్యాలయం ముందు బైఠాయిస్తాం: కేటీఆర్.

వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు కూర్చున్న కేటీఆర్, హరీశ్‌రావు
కార్యాలయం ముందు కూర్చున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
గణపతి బప్పా మోరియా రావాలయ్యా యూరియా అంటూ బీఆర్‌ఎస్ నినాదాలు
రైతులకు ఖాళీ సంచులు దిల్లీకి డబ్బుల సంచులు అంటూ బీఆర్‌ఎస్ నినాదాలు
ఖాళీ యూరియా సంచులతో నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూరియా అడిగితే రైతులపై దాడి చేస్తారా అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన
యూరియా అడిగిన మహిళా రైతులను కొడతారా అంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళన..

రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు (BRS Leaders Arrest) చేశారు…