స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.!

స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.!

స్పెషల్ జీవో తో ఎన్నికలకు.

నేడు ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం లేఖ.

సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు.

స్థానిక ఎన్నికల రిజర్వేషన్ లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం…

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది…అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు కేబినెట్ ఆమోదించే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పంటలు, రహదారులు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం.