బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి భారీ ఊరట..

అధికార కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఎన్నికపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా…ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గుర్తించిన ధర్మాసనం కాంగ్రెస్‌ అభ్యర్థి పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఊరట లభించగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ ప్రత్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి విజయం సాధించారు. అయితే కోవా లక్ష్మీ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని అజ్మీర్ శ్యామ్ కోర్టును ఆశ్రయించారు. మొదట హైకోర్టును ఆశ్రయించిన అజ్మీరా శ్యామ్ అక్కడ కోవా లక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన శ్యామ్ నాయక్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. శ్యామ్ నాయక్ పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రావడంతో న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం న్యాయం వైపే ముగ్గు చూపిందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి తెలిపారు. ఎంతో నిస్వార్ధంగా సేవ చేస్తున్న తనకు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతించారు. హైకోర్టు అనుకూల తీర్పును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం శ్యామ్ నాయక్ పిటిషన్‌ను కొట్టివేయడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.