కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయి..ఒంటెద్దు నరసింహారెడ్డి.
మెట్రో ట్రైన్ పై. ప్రభుత్వ నిర్ణయం దారుణం…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయి..
సూర్యాపేట జిల్లా…. నేరేడుచర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది….. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు KLN రెడ్డి,, సురేష్ బాబు.. చన్నబోయిన సైదులు..ex మున్సిపల్ చైర్మన్ జయ బాబు.. మాజీ dccb డైరెక్టర్, మున్సిపల్ కౌన్సిలర్, అప్పిరెడ్డి…ex జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి.. వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్లు కడియం వెంకట్ రెడ్డి,, శ్రీధర్ బాబు,,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు… పలువురు ప్రజాప్రతినిధులు.. మాజీ సర్పంచులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు…
ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న కుట్టిన రాజకీయాలు ప్రజలందరికీ అర్థమయిపోయిందని అన్నారు…
మెట్రో రైలుపై ఆ పార్టీల వైఖరిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అన్నారు…
తెలంగాణకి ఆదాయం వచ్చే వనరులన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దానధర్మాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు…
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లెక్కలు అర్థం కావడం లేదు గతం కంటే ఎక్కువ కొనుగోలు చేసాము వడ్లు అంటూ భజన చేసుకుంటున్నాడు… కానీ గతంతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు శాతం తగ్గింది..
కేవలం 59 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు…
ఇంకా రైతుల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం ఉందని ప్రస్తుతం ఆ దాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు..
యాప్ లో లేని యూరియా షాపులో ఎలా ఉంటుందని ప్రశ్నించారు…
యదేచ్చగా యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు…. సుమారు కట్టకి 300 నుంచి 400 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు…. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ధాన్యం కొనమంటూ ఎన్నడు రోడ్లెక్కలేదని అన్నారు.. సూర్య కావాలని ధర్నా చేసిన దాఖలాలు లేవు అన్నారు… కాంగ్రెస్ వచ్చాక రైతుల జీవితాలు అన్నీ కూడా ఆగమైపోయినయ్ అని అన్నారు.