ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం.

ఈ నెల 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలు

గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరపున అధ్యయన కమిటీ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ.

కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది.. అనంతరం ఈ నివేదిక అంశాలను శాసనసభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్…

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నిత్యం ఫుడ్ పాయిజన్ జరిగి అమాయక విద్యార్థులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ వరుస ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఆ ప్రకటనలో ” రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టింది. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణించారు. రేవంత్ పాలనలో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పాలన గాలికొదిలేసిన ముఖ్యమంత్రి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నారు.. అంటూ బిఆర్ఎస్ శ్రేణులు స్తున్నారు..