బంగ్లాదేశ్‌ వైపు నుంచి చొరబడుతుంటే అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను కిడ్నాప్‌ చేసిన బంగ్లాదేశీయులు..!

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌ (Bangladesh) వాసులు ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను కిడ్నాప్‌ చేశారు..కొన్ని గంటలపాటు అతడిని బందీగా ఉంచి ఆ తర్వాత విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నుర్పుర్‌ జిల్లా సుతిర బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలోని చాందినీచౌక్‌ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకొంది.

కథాలియా అనే గ్రామం వద్ద బంగ్లాదేశ్‌ వైపు నుంచి కొందరు చొరబడుతుంటే బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. దీంతో ముష్కరులు అతడిని కిడ్నాప్‌ చేశారు. వీరంతా బంగ్లాదేశ్‌లోని చపాయ్‌ నవాబ్‌గంజ్‌ ప్రాంతానికి చెందినవారిగా బీఎస్‌ఎఫ్‌ వర్గాలు చెబుతున్నాయి.

”మా జవాన్‌ను బంగ్లా జాతీయులు కిడ్నాప్‌ చేసి కొన్ని గంటలు బందీగా ఉంచారు. మేము ఈ విషయాన్ని ‘బోర్డర్‌ గార్డ్స్‌ బంగ్లాదేశ్‌’ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కొన్ని గంటల్లోనే అతడిని విడిచిపెట్టారు. ప్రస్తుతం జవాన్‌ క్షేమంగానే ఉన్నాడు” అని సౌత్‌ బెంగాల్‌ ఫ్రంటియర్‌ బీఎస్ఎఫ్‌ ప్రతినిధి వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఒక బీఎస్ఎఫ్‌ జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసిన అన్‌వెరిఫైడ్‌ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ కిడ్నాప్‌ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు బీఎస్‌ఎఫ్‌ తమ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో లోపాలను సమీక్షిస్తోంది.

ముర్షిదాబాద్‌ వద్ద బంగ్లా చొరబాట్లు తీవ్రంగా ఉంటున్నాయన్న ఆందోళనలు ఎప్పటినుంచో వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిల్‌లో ఇక్కడ జరిగిన అల్లర్ల వెనక కూడా ఈ చొరబాటుదారుల హస్తం ఉందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. ఈ దాడులకు పాల్పడిన వారిని తాము ఎప్పుడూ చూడలేదని అక్కడి ఎమ్మెల్యేనే స్వయంగా వెల్లడించారు. ”అల్లర్లు జరుగుతున్న ప్రాంతం సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాబట్టి, అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నాం. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారనడంలో ఏ సందేహం లేదు. అది ఇతర జిల్లా లేదా పొరుగుదేశం నుంచి అయినా కావొచ్చు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వాస్తవాలేంటో బయటపెడతాం” అని నాడు ఒక సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు..

జాతీయం
వార్తలు
సినిమా
లైఫ్‌స్టైల్
రాశి ఫలాలు
ఐపీఎల్
ప్రభుత్వ పథకాలు
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టీవీ
టెక్నాలజీ
Web Stories
జాబ్స్
ఎడ్యుకేషన్
ఫోటో గ్యాలరీ
ప్రభుత్వ పథకాలు
వైరల్
సంక్షిప్త వార్తలు
స్పోర్ట్స్
బిజినెస్
ఎన్నికలు
ఆధ్యాత్మికం
వీడియో గ్యాలరీ
ఏది నిజం
ట్రావెల్
జోక్స్
బెస్ట్ డీల్స్
వెబ్ స్టోరీలు
telugu Newslatest newsindia newsBsf Jawan Abducted By Bangladeshi Nationals And Released After Flag Meeting
BSF జవాన్‌ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు.. ఇప్పుడా సైనికుడు ఎక్కడ ఉన్నాడంటే?
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ వద్ద ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్‌కు గురయ్యారు. ముఖ్యంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు బంగ్లాదేశ్ వాసులను సదరు జవాన్ అడ్డుకోబోగా.. వారు అతడిని ఎత్తుకెళ్లారు. ఆపై కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకుని.. ఆ తర్వాత విడుదల చేసినట్లు బీఎస్ఎఫ్ బలగాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి.

Authored by: జౌడి జ్యోతి
Updated: 5 Jun 2025, 11:38 am|Samayam Telugu
Bangladeshi Nationals Kidnapped BSF Jawan: పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో సంచలన ఘటన జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దు వద్దు గస్తీ కాస్తున్న ఓ బీఎస్ఎఫ్ జవాన్‌కు.. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు ప్రజలు దేశంలోకి చొరబడుతూ కనిపించారు. దీంతో వెంటనే వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సైనికుడిని కిడ్నాప్ చేశారు. ఆపై కొన్ని గంటల పాటు వారి వద్దే బందీగా ఉంచుకొని.. ఆ తర్వాత విడదుల చేసినట్లు బీఎస్ఎఫ్ బలగాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని నుర్పుర్ జిల్లా సుతిర బీఎస్ఎఫ్ క్యాంపు సమీపంలోనే చాందినీ చౌక్ ఉంది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద 36వ బెటాలియన్‌కు చెందిన ఓ బీఎస్ఎఫ్ జవాన్ గస్తీ కాస్తున్నాడు. ఈక్రమంలోనే కథాలియా అనే గ్రామం వద్ద బంగ్లాదేశ్ వైపు నుంచి కొందరు భారత దేశంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈ విషయం గుర్తించిన సైనికులు వారిని అడ్డుకోబోయేందుకు యత్నించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులు అయిన ముష్కరులు.. జవాన్‌ను కిడ్నాప్ చేశారు. అంతా కలిసి కాళ్లు, చేతులు పట్టుకుని మరీ సైనికుడిని ఎత్తుకెళ్లిపోయారు…విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ వర్గాలు.. పైఅధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్‌తో మాట్లాడగా.. కొన్ని గంటల్లోనే జవాన్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ విషయాన్ని నేరుగా బీఎస్ఎఫ్ బలగాలే వెల్లడించాయి. సైనికుడిని కిడ్నాప్ చేసింది చపాయ్ నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారని చెబుతున్నారు. అలాగే జవాన్‌ను కిడ్నాప్ చేసిన ముష్కరులు కొన్ని గంటల పాటు వారి వద్దే బందీగా ఉంచుకున్నారని.. కానీ బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్‌తో మాట్లడగా.. అతడిని వారు వదిలి పెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం జవాన్ క్షేమంగానే ఉన్నాడని.. సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు..

ఈక్రమంలోనే ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. అయితే ఇది ఈ సైనికుడికి సంబంధించిన వీడియోనేనా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. ఇప్పటికే కిడ్నాప్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బీఎస్ఎఫ్ సెక్యూరిటీ తమ ప్రోటోకాల్స్‌లో లోపాలను బేరీజు వేసుకుంటోంది. ఈ సంఘటన సరిహద్దు భద్రతపై పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూరిత సంబంధాల మధ్య ఇలాంటి ఘటనలు భద్రతా యంత్రాంగానికి హెచ్చరికలుగానే భావించాలని పలువురు సూచిస్తున్నారు.