చైనా అత్యుత్సాహం,, గల్వాన్‌ లోయ సరిహద్దుల్లో భారత్ పై ప్రతిభ కనబరిచారని చైనా సైనికులకు సన్మానం…!

గల్వాన్‌ లోయ సరిహద్దుల్లో 2020 జూన్‌ 15న భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. చేతిలో తుపాకులు, ఆయుధాలు లేవు. అయినా రాళ్లు, కర్రలు, రాడ్లతో ఇరుదేశాల సైనికులు తీవ్రంగా కొట్టుకున్నారు… చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ) సభ్యుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ఆదివారం బీజింగ్‌లో అవార్డులు అందించింది. సీపీపీసీసీ చైనాలో ఓ రాజకీయ సలహా కమిటీగా పనిచేస్తుంది. ఇది అక్కడి యునైటెడ్‌ ఫ్రంట్‌ సిస్టమ్‌లో ఒక భాగం. ఇది అక్కడి ప్రభుత్వ విభాగాలకు రాజకీయ, సామాజిక అంశాలపై పలు సలహాలు, సూచనలు ఇస్తుంది.

2020లో విదేశీ శక్తులతో జరిగిన ఘర్షణలో సరిహద్దులు కాపాడేందుకు క్వి ఫాబావో బలంగా నిలబడ్డారని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. గతంలో అతడికి సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ నుంచి పతకం లభించింది. ఆ తర్వాత బీజింగ్‌లో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌లో కూడా టార్చిబేరర్‌గా అవకాశం కల్పించింది. నాడు అమెరికా సెనెట్‌ ఫారన్‌ రిలేషన్స్‌ కమిటీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇతడిపై వీఘర్‌ ముస్లిం అణచివేత ఆరోపణలు కూడా ఉన్నాయి.

38 మంది చైనా సైనికులు హతం

మొత్తం మీద 2020 జూన్‌ 15న గల్వాన్ లోయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత వీర సైనికులు అమరులయ్యారు. మన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. చైనా వైపున దాదాపు 38 మంది సైనికులు మట్టికరిచారు. అయితే చైనా మాత్రం తమ నలుగురు సైనికులే చనిపోయారని ప్రగల్భాలు పలుకుతోంది..గల్వాన్‌ ఘర్షణ సమయంలో క్వి పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ షింజియాంగ్‌ మిలిటరీ కమాండ్‌లో రెజిమెంటల్‌ కమాండర్‌గా చేస్తున్నాడు. నాడు ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు కనీసం 38 మందికిపైగా చనిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ, చైనా మాత్రం నలుగురు సైనికులే చనిపోయారని బుకాయించింది.