సంపూర్ణ చంద్ర గ్రహణం… ఇలా ఉన్నాయి..!

చంద్ర గ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణం:-

సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని తెలిపారు. హోలీ పండగ రోజునే ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది… గ్రహణ సంబంధానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా.

03-03-2026 వతేది ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం రోజున కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం. ఈ గ్రహణం ఖండగ్రస్త చంద్ర గ్రహణం భారతదేశం అంతటా కనిపించును.

తేదీ:-03-03-2026

గ్రహణ ప్రారంభకాలం (స్పర్శకాలం): మధ్యాహ్నం గం.03-19 ని.లకు గ్రహణ మధ్య కాలం:- సాయంత్రం గం.05.03ని.లకు గ్రహణ మోక్షకాలము.:- సాయంత్రం గం.06.46 ని.లకు

ఆద్యంతం మొత్తం గ్రహణకాలం:- గం.03.27 ని.లు

చంద్రోదయాది గ్రహణ పుణ్యకాలం:- 42 నిమిషాలు మాత్రమే

ఈ గ్రహణం పూర్వఫల్గుణి (పుబ్బ) నక్షత్రం సింహారాశియందు సంభవించును. కావున పూర్వఫల్గుణి(పుబ్బ) నక్షత్రం వారు సింహరాశి వారు ఈ గ్రహణం చూడరాదు.

నిత్య భోజన విధులు:- పగలు 11 లోపల ఆహారం భుజించవలెను . సాయంత్రం 7 తర్వాత ఆహారం వండి భుజించవలెను. గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 వరకు ఇంటిలోపలే ఉండవలెను

గ్రహణ అనంతరం మరుసటి రోజు యథావిధిగా పూర్వఫల్గుణి నక్షత్రం వారు సింహరాశి వారు పాలు, బియ్యం, వెండి నాగపడిగ, చంద్ర బింబం దక్షిణ సహితంగా దానం చేసి గ్రహణ శాంతి చేసుకోవలెను.