హిందు క్యాలెండర్లో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతారు. అలాగే, పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, బాధ్రపద పౌర్ణమి మరింత విశిష్టత ఉన్నది. వాస్తవానికి పితృపక్షాలు భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. చంద్ర గ్రహణం ఆదివారం(సెప్టెంబర్ 7) రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉండనున్నట్లు పండితులు చెబుతున్నారు. మరి, సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ ద్వాదశ రాశుల వారు “రెండు మంత్రాలు” జపించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ముందుగా ఇవాళ్టి పన్నెండు రాశుల ఫలితాలను ఈవిధంగా వివరిస్తున్నారు.
మేషరాశి : కుటుంబంలో విబేధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే, బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే, వృత్తి, ఉద్యోగ పరంగా విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతారు.
వృషభరాశి : ఉద్యోగ సౌఖ్యం ఉంది. ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. అలాగే, వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు.
మిథునరాశి : భోజన సౌఖ్యం ఉంది. అంటే, బ్రహ్మాండమైన, రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే, రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయంటున్నారు.
కర్కాటక రాశి : అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే, ఈ రాశి వారు ఇవాళ సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపార రంగంలోనూ నష్ట సూచనలున్నాయి. కాబట్టి, వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. చిక్కులు, చికాకులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు.
సింహరాశి : సాహిత్య రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ధనలాభ సూచనలున్నాయి. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా విశేషంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి.
కన్యారాశి : ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచనలున్నాయి. అందుకే, డబ్బు ఖర్చు చేసే విషయంలో ఈ రాశివారు కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే, అనుకోని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పని మీద బయటకు వెళ్లేటప్పుడు వెల్లుల్లి పాయ దగ్గర ఉంచుకొని వెళ్లడం ద్వారా మంచి జరుగుతుందంటున్నారు జ్యోతిష్యులు తెలుపుతున్నారు…