చింతలపాలెంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

*చింతలపాలెం మండలంలో అంగన్వాడీ కేంద్రాల డిజిటల్ సేవలను బలోపేతం చేయడానికి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కోదాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ పారిజాతం మరియు చింతలపాలెం సెక్టర్ సూపర్వైజర్ సరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియను సులభతరం చేయడానికి Samsung Galaxy 5G, A06 ఫోన్లను టీచర్లకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో డేటా నమోదు వేగవంతం కావడంతో పాటు సేవల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.