స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర అధికారులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి కి ఆత్మీయ స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్కు చేరుకున్నారు.దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. సమావేశాల తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్మ్యాప్ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959