రేపు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..
_• మధ్యాహ్నం 3.35 గంటలకు నల్గొండ జిల్లా,కనగల్ AMC మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్లకు శంకుస్థాపన చేసి పైలాన్ ను ఆవిష్కరించనున్న సీఎం._
_• సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి._
_• రూ.83 కోట్లతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 కు శంకుస్థాపన చేయనున్న సీఎం._
_• అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.
భారీ బహిరంగ సభలో పాల్గొని, రూ.13,000 కోట్ల విలువైన రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. మంత్రులు, స్థానిక నాయకులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.