కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ఖండంచారు. కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణిపై సోషల మీడియాలో వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ‘మమ్మల్ని జైల్లో పెట్టొచ్చు.. మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించవచ్చు.. కానీ న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న దేశ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు ఎప్పటికీ అణచివేయలేరు’ అని కామెంట్ చేశారు.ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశ యువత హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారని, వారి పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరని స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న యువతకు, వారి ఆకాంక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.