మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువ మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని.. ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చి.. తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి ఉన్నదని.. ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిలను వసూలు చేయాల్సిందేనన్నారు. బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాల రూపొందించాలని.. ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సూచించారు..
నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో
పెండింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు, నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్వహణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాను. రైతులకు సాగునీరు అందేలా, ప్రతి ఎకరాకు నీటి భరోసా కల్పించే దిశగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించాను.
తెలంగాణ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పిస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు..