ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా వచ్చి కొండా సురేఖను సస్పెండ్ చేయాలని ప్రెస్ మీట్ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
కొండా సురేఖ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉందని, కేటీఆర్, సమంత అంశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు కానీ, అనామకులైన కొండా సుష్మిత కాంగ్రెస్ ఎమ్మెల్యేను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుందని, ఇంతకంటే బజారు కల్చర్ ఎక్కడా ఉండదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, మీరు మాత్రం మీ పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ రాక్షస పాలనను ఎదిరించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని.. అలాంటి సీఎంను.. కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తూ.. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై..వ్యక్తిగతంగా విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె అంశంపై హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.
నాయిని రాజేందర్ రెడ్డి..
కేఆర్ నాగరాజు..
బీర్ల ఐలయ్య..
మధుసూదన్ రెడ్డి..
రేవూరి ప్రకాష్ రెడ్డి..
దొంతి మాధవరెడ్డి..
మందుల సామెల్..
వెడ్మ బొజ్జు..
వేముల వీరేశం..
బుయ్యని మనోహర్ రెడ్డి..
కూచుకుళ్ల రాజేష్ రెడ్డి..
బత్తుల లక్ష్మా రెడ్డి..
బాలు నాయక్..
వీర్లపల్లి శంకర్..
కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
చిక్కుడు వంశీకృష్ణ..
బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ..
బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ..
రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదు.వేముల వీరేశం..
కొండా సురేఖకు నోటీసులు ఇస్తే.. నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని చెబుతుంది..
నీకు సంబంధం లేకపోతే ఆమె మాటలను నువ్వు ఎందుకు ఖండించలేదు?..
మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారు..
మీరు మాత్రం మీ పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు..పదవిలో ఉంటూ సీఎంను విమర్శిస్తాను అంటే ఊరుకోం అని హెచ్చరించిన ఆయన.. కొండా సురేఖ వ్యాఖ్యలు ఎప్పుడూ పార్టీకి నష్టమే చేస్తున్నాయన్నారు. పనిగట్టుకుని ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి ఉండాలని.. గీత దాటితే ఊరుకునేది లేదని.. AICC చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారాయన. సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపైనే ఎంత అంటే అంత మాటలు అనటం ఏంటని ప్రశ్నించారాయన..
కొండా సుష్మిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం..
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేశారు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు…సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సుష్మిత కామెంట్లపై మంత్రి కొండా సురేఖ ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కొండా సురేఖ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ సీఎంపై విమర్శలుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
పదేళ్ల పాలనలో రాష్ట్రానికి బీఆర్ ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు బీర్ల ఐలయ్య.. పేదలకోసం కష్టపడుతున్న సీఎంను విమర్శించడం సరికాదన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ను బీజేపీ, బీఆర్ ఎస్ లే అడ్డుకున్నాయని ఆరోపించారు బీర్ల ఐలయ్య..