ది కోకాకోలా కంపెనీ తన భారత్ లో సుమారు 1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని లక్ష్యం..!

ప్రపంచ ప్రసిద్ధ శీతలపానీయాల సంస్థ ది కోకాకోలా కంపెనీ తన భారత బాటిలింగ్ అనుబంధ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)Coca Cola IPO: ₹9,500 కోట్ల ఐపీఓకు కోకాకోలా ఇండియన్‌ యూనిట్‌ | coca-cola-eyes-1-billion-dollors-ipo-for-indian-bottling-unit.
కు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే వారం లండన్‌లో ప్రజెంటేషన్ జరగవచ్చని తెలుస్తోంది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఉన్న రోత్‌స్చైల్డ్ అండ్ కో బ్యాంకర్లతో చర్చలు జరపనుంది. అయితే దీనిపై కోకాకోలా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవల కాలంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ భారత అనుబంధ సంస్థలను ఐపీఓకు తీసుకొస్తున్న నేపథ్యంలో కోకాకోలా కూడా ఈ జాబితాలో చేరనుంది. కంపెనీకి భారత్ కీలక మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 12 రాష్ట్రాల్లో 14 తయారీ యూనిట్లు కలిగి ఉంది. దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా 17 లక్షల రిటైల్ అవుట్‌లెట్లకు సేవలు అందిస్తోంది…

ప్రస్తుతం కంపా కోలా మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోని తమ కంపెనీలను ఐపీఓగా తీసుకొస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స ఇంక్ తన భారతీయ అనుబంధ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓను గత సంవత్సరం తీసుకొచ్చింది. హ్యుందాయ్ మోటర్ కో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓగా తీసుకొచ్చి 3.3 బిలియన్ డాలర్లను సేకరించింది. కాగా హిందుస్థాన్ కోకా-కోలా పానీయాలు భారతదేశంలోని అతిపెద్ద శీతల పానీయాల బాటిల్‌లలో ఒకటిగా ఉంది.