వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత …

వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

ప్రభుత్వ భూముల వేలంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు

భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి

తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు వచ్చిన మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు

మర్రి యాదవరెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

Bhadrakali Temple..

తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఅర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు శుక్రవారం అక్కడికి తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు రావడంతో ఆందోళన నెలకొంది. ఇరు పార్టీల నేతలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్లాట్ల వేలం పాటలో దాదాపు రూ. 50 కోట్ల మేర భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ నేతలు తిప్పి కొట్టారు. ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆరోపణలను నిరసిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకునేందుకు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి రంగంలోకి దిగారు. అందరి ముందు అమ్మవారి సన్నిధిలో తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన తడి బట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయడానికి నిశ్చయించుకుని రావడంతో ఉద్రిక్తత నెలకొంది.