చల్లని నీటితో స్నానం చేస్తే ఇబ్బందులు తప్పవా..!?

ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని కూడా మార్చుకుంటున్నారు. అందుకే చిన్నతనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు..గతంలో 45 దాటిన తరువాత వచ్చే బీపీలు, షుగర్‌లు, మధుమేహం, డయాబెటిక్, ఒబేసిటీ చిన్న తనంలోనే వచ్చేస్తున్నాయి. పదేళ్లు నిండని వారికి కూడా షుగర్ వ్యాధి వచ్చి పడుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అప్పటి వరకు మన కళ్ళముందే ఆఫీసులో పని చేస్తూ పార్టీల్లో డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో మృతి చెందుతున్నాడు. ఈ గుండెపోటు మరణాలపై తాజాగా జరిపిన అధ్యయనంలో సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. చలికాలంలో కొంతమంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లని నీటితో స్నానం చేస్తే గుండెపోటు..

చలికాలంలో చాలా మంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. ఇది గుండెపోటుకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్లను ఒక్కసారిగా తలమీద పోసుకున్నప్పుడు ఒక్కసారిగా రక్తప్రసరణ సంకోచానికి గురవుతుంది. దీనివల్ల రక్త ప్రసారంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలా అంతరాయం ఏర్పడినప్పు గుండెపోటు సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయండి..

అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి, ఈ ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు పరిష్కార మార్గం కూడా ఉందని వెల్లడించారు. చలికాలంలో చల్లని నీటితో స్నానం చేసేటప్పుడు నీటిని మొదటగా తలపైన కాకుండా.. ముందు కాళ్ళ మీద, వీపు మీద, మెడ మీద పోసుకోవాలట. ఆ తరువాత తలపై పోసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా చలికాలంలో వేడి నీళ్లతో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతారు. కానీ నీళ్లు అందుబాటులో లేని వ్యక్తులు పైన పేర్కొనబడిన విధంగా చేయాలని వెల్లడించారు.

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి మన శరీరానికి కనిష్ట ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అలాగే చర్మంలోని తేమ పోకుండా అలానే సురక్షితంగా కనిపిస్తుంది. చర్మం పొడి బారడం, పగిలిపోవడం వంటి సమస్యలు సతాయించవు. అందుకే చలికాలంలో వేడి నీటితో కన్నా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదే, కానీ పైన వెల్లడించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

గమనిక: విషయాలన్నీ ఇంటర్నెట్‌లో సేకరించినవి.. మీరు వైద్య నిపుణుల సలహాలు స్వీకరించి ఆచరించగలరని మనవి.