సొంత ప్రభుత్వంపై మరోసారి రాజగోపాల్ రెడ్డి ఫైర్..!.

మరోసారి సొంత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్న వారి వెంట పడతాం.

రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పేదల కోసం పోరాటం చేస్తాం – మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

మంత్రి పొంగులేటిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు

పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నాడు

పేదలకేమో 5 లక్షల ఇందిరమ్మ బిల్లు కోసం 500 రూల్స్ పెట్టారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్లు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే నాకు బాధగా ఉంది

రేవంత్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్న వారిపై తాము పోరాటం చేస్తామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేసిన ఆయన.. “పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటుంటే.. పేదలకు మాత్రం రూ.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కోసం 500 నిబంధనలు పెడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించినట్లు తెలిపారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పెద్ద పెద్ద పదవుల్లో కొనసాగుతుండటం తనకు బాధగా ఉందన్నారు.
“మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు. రైతులు, నిరుద్యోగులు, పేదల కోసం పోరాటం చేస్తాం” అంటూ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా విమర్శలు చేయడం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.