పార్టీ జెండాలతో పెళ్లికి ర్యాలీగా రావాలని మాజీ ఎమ్మెల్యే కూతురు.!!.అసలేం జరిగిందంటే…

పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్ పెళ్లికి అంగీకరించాడు.

అసలేం జరిగిందంటే..

గుంటూరు నగరానికి చెందిన ఐపీఎస్ అధికారితో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో పెళ్లి నిశ్చయించారు. దీంతో డిసెంబర్ 17న సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు గుంటూరుకు తరలివచ్చారు. ఆ క్రమంలో పెళ్లి కుమారుడు ఇంటి నుంచి కాంగ్రెస్ జెండాలతో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం మంచిది కాదని పార్టీ కేడర్‌ను ఐపీఎస్ బంధువులు వారించారు. అందుకు వధువు తరఫు బంధువులు ససేమిరా అన్నారు..ఈ నేపథ్యంలో వరుడు ఐపీఎస్ అధికారి కావడంతో.. పార్టీ జెండాలు మంచిది కాదంటూ.. పెళ్లి కుమార్తె బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వధువు బంధువులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో యువ ఐపీఎస్ అధికారి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ పెళ్లి చేసుకొనేందుకు ఐపీఎస్ అధికారి నిరాకరించాడు. ఈ విషయం తెలిసి.. పెళ్లి కుమార్తె తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేడర్.. ఐపీఎస్ అధికారి నివాసం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

చివరకు ఏడు గంటల చర్చల అనంతరం పెళ్లి..

ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించేందుకు.. చర్చి పెద్దలు, పాస్టర్లు చర్యలు చేపట్టారు. గత అర్థరాత్రి 12.00 గంటల నుంచి బుధవారం ఉదయం 7.00 గంటల వరకు చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. బుధవారం.. అంటే ఈ రోజు సాయంత్రం.. అదే వివాహ వేదికగా పెళ్లి ముహూర్తం ఇరు వర్గాల పెద్దలు కలిసి నిశ్చయించారు. ఈ ఐపీఎస్ అధికారి గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అదీకాక.. జిల్లాలో సదరు కాంగ్రెస్ నాయకుడికి భారీగా కేడర్ ఉంది. దీంతో తమ నాయకుడు కుమార్తె వేడుకకు వారంతా గుంటూరు తరలి వచ్చారు.
. ఏడు గంటల పాటు చర్చి పెద్దలు, పాస్టర్లు బుజ్జగించి ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించారు. దీంతో నిన్న జరగాల్సిన పెళ్లి ఈరోజు ఉదయం జరిగింది. మాజీ ఎమ్మెల్యే భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..