కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్.

*కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన తండ్రి రౌడీ షీటర్ చిన్న శీశైలం యాదవ్‌ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ అయ్యారు. చిన్న శ్రీశైలం యాదవ్‌తో సహా వందమంది రౌడీ షీటర్ల బైండోవర్ అయ్యారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ఆ నియోజవకర్గంలో 100 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. బోరబండ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లు ఉన్నారు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండోవర్ చేసిన పోలీసులు..

చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు మరో వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్..

మధురా నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది.. బోరబండ పీఎస్‌లో 74 మంది రౌడీ షీటర్ల బైండోవర్..

ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా

నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ షీటర్లపై చర్యలు..

కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు..

ఆ వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోనని లిఖితపూర్వకంగా ఒక బాండ్‌ పేపర్‌పై హామీ ఇస్తాడు. వారు సొంత పూచీకత్తుపై విడుదల చేయబడతారు.

సాధారణంగా, బైండోవర్ అయిన వ్యక్తి ఆ రోజు నుంచి నిర్ణీత కాలం (ఉదాహరణకు, ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం) వరకు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు.

ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత వారు నేరానికి పాల్పడితే, వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్లు 107, 108, 109, 110 కింద నిర్వహిస్తారు..