కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగని మంత్రుల పంచాయతీ మంత్రి వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
మంత్రి వివేక్ వెంకటస్వామి Vs మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగని మంత్రుల పంచాయతీ
మంత్రి వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
వివేక్ నా పేరు తీసి మాట్లాడడం అత్యంత బాధాకరం
నేను ఒకటే పార్టీకి, ఒకటే జెండాకు కట్టుబడి ఉన్నా.. పార్టీ లైన్ దాటి ప్రవర్తించను
మా మద్యలో ఏదైనా ఉంటే ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది
వివేక్ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకు, మర్యాదకు, గౌరవానికి వదిలేస్తున్నాను – మంత్రి అడ్లూరి లక్ష్మణ్..
మంత్రి వివేక్ వెంకటస్వామి Vs మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వివేక్
నేను మాల జాతికి చెందిన వాడిని అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు
జూబ్లీహిల్స్ ఇంచార్జ్ గా నాకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్కి కుళ్ళు
కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు.. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా
మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు.. నన్నే ఎందుకు విమర్శిస్తున్నారు
అడ్లూరి లక్ష్మణ్కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే కాకా వెంకటస్వామి.. ఈ విషయం మర్చిపోతున్నాడు – మంత్రి వివేక్ వెంకటస్వామి…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల సొంత పార్టీకి చెందిన మంత్రుల మధ్య లొల్లీ పీక్స్ కు చేరింది. ఇప్పటికే ఒక వైపు బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పై బీసీ రిజర్వేషన్ అంశంపై ఏకీపారేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు మంత్రుల మధ్య రచ్చ కాస్త కాంగ్రెస్ కు మరో తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.ఈ క్రమంలో ప్రస్తుతం మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరీపై ఫైర్ అయ్యారు…జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు.ఈ క్రమంలో మంత్రి అడ్లూరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లిహీల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొసం ఎంతో పాటుపడుతున్నట్లు చెప్పారు. కానీకొంత మంది మాత్రం.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ని ఓడగొట్టేందుకు నా పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందన్నారు.
తాను నీతి,నిజాయితీ,న్యాయం కోసం పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చెన్నూరు,సిద్దిపేట, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే కొందరికి కండ్లు మండుతున్నాయన్నారు..