కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) అభ్యర్థిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు…రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థిగా నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న మహేష్ కుమార్ గౌడ్.. అల్ఫోర్స్(Alphors) విద్యాసంస్థల ఛైర్మన్ పేరు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.
కమిటీల్లో కష్టపడి పని చేసేవారికి ఈ నెలాఖరు లోగా పదవులు ఇస్తామని అన్నారు. జనవరి చివరి వారంలో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. నేడు కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు డి.వి. సత్యనారాయణ రావు(DV Satyanarayana Rao)ను.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు…..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్నారు. పార్టీ నేతలందరూ వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని గట్టిగా హెచ్చరించారని చెప్పారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు వేస్తామని, పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పనిచేసిన నాయకులకే పదవులు వస్తాయన్నారు. కార్పొరేషన్ పదవుల భర్తీ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని తెలిపారు.