సమిష్టిగా రాణించిన రైజర్స్‌.. ..చెన్నై ఆశలు గల్లంతే

రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. 2025 ఐపీఎల్లో మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 155 పరుగుల టార్గెట్ను సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (44 పరుగులు), కమిందు మెండీస్ (30 పరుగులు) రాణించారు. చివర్లో నితీశ్ రెడ్డి (19) ఆకట్టుకున్నాడు. నూర్ అహ్మద్ 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, జడేజా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

టార్గెట్ చిన్నదే అయినా ఛేదనలో సన్రైజర్స్ బాగా కష్టపడింది. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన ఇషాన్తో హెడ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఆరో ఓవర్లో హెడ్ (19), 8.1 వద్ద క్లాసెన్ (7) వరుసగా పెవిలియన్ చేరడం వల్ల సన్రైజర్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్ ఆచితూచి ఆడాడు. కీలక ఇన్నింగ్స్తో జట్టును విజయం దిశగా నడిపించాడు. తర్వాత ఇషాన్, అనికేత్ (19) ఔటైనా చివర్లో మెండిస్, నితీశ్ ఆట పూర్తి చేశారు.

12ఏళ్లలో తొలిసారి
కాగా, సన్రైజర్స్ ఈ మ్యాచ్తో అరుదైన ఘతన సాధించింది. 12ఏళ్ల తర్వాత చెన్నైను తమ సొంతగడ్డ చెపాక్లో ఓడించడం ఇదే తొలిసారి. ఇక తాజా విజయంతో సన్రైజర్స్ ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆరు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి వెళ్లింది. అటు సీజన్లో చెన్నై ఏడో ఓటమి మూటగట్టుకుంది. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే!..

మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెల‌వాలి

ఈ సీజ‌న్‌లో చెన్నై మ‌రో 5 మ్యాచ్‌లు ఆడ‌నుంది. పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచుల్లో సీఎస్‌కే త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాలి. అప్పుడు చెన్నై ఖాతాలో 14 పాయింట్లు వ‌చ్చి చేరుతాయి…

చెన్నై: షేక్‌ రషీద్‌ (సి) అభిషేక్‌ (బి) షమి 0, ఆయుష్‌ మాత్రే (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 30, సామ్‌ కర్రాన్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 9, జడేజా (బి) మెండిస్‌ 21, బ్రెవిస్‌ (సి) మెండిస్‌ (బి) హర్షల్‌ 42, శివమ్‌ దూబే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 12, దీపక్‌ హుడా (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 22, ధోనీ (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ 6, అన్షుల్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 2, నూర్‌ అహ్మద్‌ (సి) షమి (బి) హర్షల్‌ 2, ఖలీల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.5 ఓవర్లలో 154 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-39, 3-47, 4-74, 5-114, 6-118, 7-131, 8-134, 9-137, 10-154; బౌలింగ్‌: షమి 3-0-28-1, కమిన్స్‌ 4-0-21-2, జైదేవ్‌ ఉనాద్కట్‌ 2.5-0-21-2, హర్షల్‌ పటేల్‌ 4-0-28-4, జీషన్‌ అన్సారి 3-0-27-0, కమిందు మెండిస్‌ 3-0-26-1.

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) ఆయుష్‌ (బి) ఖలీల్‌ 0, హెడ్‌ (బి) అన్షుల్‌ 19, ఇషాన్‌ (సి) కర్రాన్‌ (బి) నూర్‌ 44, క్లాసెన్‌ (సి) హుడా (బి) జడేజా 7, అనికేత్‌ (సి) హుడా (బి) నూర్‌ 19, మెండిస్‌ (నాటౌట్‌) 32, నితీశ్‌ (నాటౌట్‌) 19, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18.4 ఓవర్లలో 155/5; వికెట్ల పతనం: 1-0, 2-37, 3-54, 4-90, 5-106; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-0-21-1, అన్షుల్‌ 3-0-16-1, నూర్‌ అహ్మద్‌ 4-0-42-2, జడేజా 3.4-0-22-1, కర్రాన్‌ 2-0-25-0, పథిరన 3-0-27-0.