నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. దీనికి యెమన్ “దిట్వా”గా నామకరణం చేసింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు…నైరుతి బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి “దిట్వా”గా మారిందని తెలిపారు. చైన్నైకు 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని చెప్పారు. (Cyclone Ditva)..
ఈ తుపాను శ్రీలంకలోని టింకోమలీకి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకు ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తమిళనాడు , పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశముందని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఆదివారం కడప, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని సూచించారు..