దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్​ న్యూస్​

Dasara Special Trains..దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

దసరాకు హైదరాబాద్​ (Hyderabad) నగరం నుంచి వేలాది మంది ప్రజలు స్వగ్రామాలకు వెళ్తారు. దీపావళి సమయంలో సైతం రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో టీజీఎస్​ ఆర్టీసీ దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది. తాజాగా రైల్వే శాఖ సైతం స్పెషల్​ ట్రైన్లు వేస్తున్నట్లు ప్రకటించింది.

Dasara Special Trains | ఈ మార్గాల్లో..

చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నారు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సైతం స్పెషల్​ ట్రైన్​ సేవలు అందిస్తోంది. నవంబర్ 25 వరకు విశాఖపట్నం-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, నవంబర్ 30 వరకు నర్సాపూర్-తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడుపుతామని అధికారులు తెలిపారు..

నిర్మాణ పనుల వద్ద బారికేడింగ్: అమృత్ భారత్ తదితర పథకాల కింద స్టేషన్ ప్రాంగణాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రాంతాల్లో పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

రైళ్ల భద్రతా తనిఖీలు: రద్దీ సమయంలో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లలో పండుగల సీజన్‌లో ఊహించని రద్దీ ఉండే అవకాశం ఉండటంతో, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని రైల్వే యంత్రాంగాన్ని ఆదేశించారు.