డిగ్రీ విద్యార్థులకు పారిశ్రామిక పర్యటన ప్రత్యక్ష పని అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.. ప్రిన్సిపల్ ఎస్ రామారావు..
డిగ్రీ విద్యార్థులకు పారిశ్రామిక పర్యటన ప్రత్యక్ష పని అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుందని హుజూర్ నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రామారావు అన్నారు .
బుధవారం హుజూర్ నగర్ డిగ్రీ కాలేజీ ఆర్థిక శాస్త్ర విద్యార్ధులకు మార్కేట్ కమిటీ , గోదాము లు నిర్వహణ పై అవగాహన కల్పించారు . పట్టణంలోని మార్కెట్ కమిటీ లో రైతులనుంచి ధాన్యం కొనుగోళ్ళు , గోదాముల నిర్వహణ ,రైతు బంధు పధకం గురించి వివరించారు . మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ విద్యార్ధులతో మాట్లాడుతూ పారిశ్రామిక పర్యటన లు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవంగా స్థానిక పరిస్థితులు మరియు నిర్వహణ పద్ధతులతో పోల్చి చూసుకోవడానికి సహాయపడుతుందన్నారు , తద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందటానికి,భవిష్యత్ లో హాజరయ్యే పోటీ పరీక్షలకు మంచి మార్కులు సాధించడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లు కోతి సంపత్ రెడ్డి, సులువ చంద్ర శేఖర్, దగ్గుపాటి బాబు రావు , మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆర్ సంతోష్ కుమార్, గ్రేడ్ టు సెక్రటరీ ఎం ఏ ఘని , సూపర్ వైజర్ నవీన్ కుమార్ కార్యాలయ సిబ్బంది , కళాశాల సిబ్బంది క్రాంతి కుమార్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.