Delhi Exit Polls 2025..ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల..

Delhi Exit Polls 2025.

*🔹ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల*.

గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 6 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం జరిగింది.

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19, ఏబీపీ

మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37,

ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3,

చాణిక్య స్ట్రాటజీస్‌: బీజేపీ 39-44, ఆప్‌ 25-28,

కేకే సర్వేలో బీజేపీ 22, ఆప్‌ 39,

ఢిల్లీ టౌమ్స్‌ నౌ: బీజేపీ 39-45, ఆప్‌ 22-31.

Delhi Exit Polls 2025..

*ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి?*

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబో తున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్ పోల్ తన అంచనాలను ప్రకటించింది.

ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిప త్యానికి గండి కొట్టబోతున్న ట్లు తెలిపింది.ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించు కోబోతున్నట్లు తెలిపింది.

అలాగే అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించబో తున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీ దున్న ఆప్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా నాలుగోసారి డిల్లీలో అధికారం దక్కించు కునేందుకు శ్రమించారు.

అయితే కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేకపోతు న్నారన్న అపప్రదను పోగొట్టుకునేం దుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపుతెచ్చాయి..

ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ, అవి ఎల్లప్పుడూ పూర్తిగా ఖచ్చితమైనవి కావు. నమూనా లోపాలు, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయాలు మరియు నిశ్శబ్ద ఓటర్లు వంటి అంశాలు ఎగ్జిట్ పోల్ అంచనాలు మరియు వాస్తవ ఫలితాల మధ్య వ్యత్యాసాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఎన్నికల సంఘం ప్రకటించిన ఫిబ్రవరి 8, 2025న తుది ఫలితాల కోసం వేచి ఉండటం మంచిది.