ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పారితోషకాలు..
చందంపేట……..
మార్చి 2026 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో చందంపేట మండల టాపర్స్ గా వచ్చిన విద్యార్థులు జెరుపుల దేవేందర్ మార్కులు 535, గోసుల నందిని మార్కులు 507, ఎం ధనలక్ష్మి మార్కులు 501 వీరిని మండల తహసీల్దార్ ఎం శ్రీధర్ బాబు మొదటి పారితోషకముగా 8000, రెండవ పారితోషకముగా 3000, మూడవ పారితోషకముగా 2000 బహుకరించి ఆ విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి లీలారాణి, LFL HM లాలు, ఎం చంద్రశేఖర్, గోవిందు కొండయ్య, జోసెఫ్ చౌదరి, రామచంద్రు, విజయ, ఎల్ మధు, డాక్టర్ వెంకట్, సంధ్యారాణి, గ్రామ ఉపసర్పంచ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.