ఆగస్టు 18 నుండి 26 వరకు తీజ్ జాతర… అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని సంఘ్ పిలుపు.
దేవరకొండ………..
గిరిజన గుండెల చప్పుడు తీజ్ రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ ఆధ్వర్యంలో వైభవంగా
గిరిజనుల సంస్కృతికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను ఈ నెల 18-08-2026 నుండి 26-08-2026 వరకు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ పిలుపునిచ్చింది.
ఈ మేరకు సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ, తీజ్ పండుగను ప్రధానంగా పెళ్లి కాని అమ్మాయిలు మేరమ్మ యాడి, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఎంతో పవిత్రంగా పూజిస్తారని తెలిపారు.
ఈ పండుగ చేయడం వల్ల పాడి, పంటలు వృద్ధి చెందుతాయని, అన్ని గ్రామాల ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో ప్రతి ఏడాది జరుపుకుంటామని వారు వివరించారు.
అన్ని గ్రామాల్లో మన సాంప్రదాయబద్ధమైన తీజ్ పండుగను వైభవంగా నిర్వహించాలని, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంస్కృతిని కాపాడాలని రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ కోరింది.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు
ఈ సమావేశంలో సంఘ్ అధ్యక్షులు రామవత్ వంశీ నాయక్, ప్రధాన కార్యదర్శి జటవత్ ప్రకాష్ నాయక్ సోషల్ మీడియా కన్వీనర్ రామావత్ రాంబాబు నాయక్ నేనవత్ నాగార్జున, నేనవత్ వినోద్, కోశాధికారి నేనవత్ రాజు, కార్యదర్శి మాతృ, మాకట్లల్, శంకర్, కొర్ర నెహ్రు, కొర్ర విజయ్, నేనవత్ తిరుపతి, ఈశ్వర్, అనిల్, విక్రమ్, బన్నీ, అశోక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.